- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనుమాన్ జయంతి స్పెషల్.. ‘విశ్వంభర’ నుంచి ‘రామరామ’ సాంగ్ విడుదల.. గూస్‌బంప్స్ ఖాయం
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)వశిష్ఠ మల్లిడి(Mallidi Vassishta) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)వశిష్ఠ మల్లిడి(Mallidi Vassishta) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. సోసియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుండగా.. దీనిని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీ కృష్ణా రెడ్డి(Vamsi Krishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మి్స్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు చేస్తున్న 156 చిత్రం ‘విశ్వంభర’ కావడంతో అంతా ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ చిరంజీవికి అత్యంత ఇష్టమైన దేవుడు హనుమాన్ జయంతి సందర్భంగా ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘రామ రామ శ్రీరామ’ సాంగ్ రిలీజ్ చేసి మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఇక ఇందులో తయ్ తయ్ తక్కథిమి చక్కాభజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా.. ఆ సాములోరి పక్కనున్న సీతా మా లచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందాం.. అని సాగే ఆ పాట లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సాంగ్ మొత్తం కలర్‌ఫుల్‌గా ఉండగా.. చిరు లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అలాగే లిరిక్స్.. మ్యూజిక్ అందరిలో గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి.






