నాని చేతుల మీదుగా ‘రామం రాఘవం’ ట్రైలర్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-02-14 13:46:03  IST  )

ప్రముఖ కమెడియన్ ధన్‌రాజ్(Dhanraj) నటిస్తూ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’(Raamam Raaghavam).

నాని చేతుల మీదుగా ‘రామం రాఘవం’ ట్రైలర్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: ప్రముఖ కమెడియన్ ధన్‌రాజ్(Dhanraj) నటిస్తూ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’(Raamam Raaghavam). ఇందులో సముద్రఖని (Samuthirakani) కీలక పాత్రలో నటిస్తుండగా.. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘నాన్న’ సెంటిమెంట్ సాంగ్ మంచి హిట్ కాగా.. తాజాగా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

‘రామం రాఘవం’ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని (Nani) చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు ధనరాజ్ ప్రకటిస్తూ.. ‘అత్యంత వినోదాత్మక DJ (ధనరాజ్) కోసం అత్యంత ఇష్టపడే PJ (పిల్ల జమిందార్) వస్తున్నాడు.. బావ ఎప్పుడు వచ్చితివి నీవు.. రామం రాఘవం నుంచి పవర్ ఫుల్ ట్రైలర్‌ని ఫిబ్రవరి 14న మన నేచురల్ స్టార్ నాని లాంచ్ చేయనున్నారు’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Next Story