- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాతగా రామ్ పోతినేని సోదరుడు?
తన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణంలో రామ్ పోతినేని నెక్స్ట్ సినిమా

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారి బంధువులు కూడా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్‌లో తనకంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రామ్ పోతినేని ఒకరు. ఈయన చాలాకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని కూడా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. చాలా కాలంగా రామ్‌తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అందుకు సరైన అవకాశం రాలేదని తెలిసింది. ఇక రామ్ పోతినేని తదుపరి చిత్రానికి కృష్ణ పోతినేని నిర్మాతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లోగి విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అదే విధంగా, ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ మరియు అనిరుధ్ రవిచందర్ వంటి భారీ క్రేజ్ కలిగిన ప్రముఖులు కూడా భాగం కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






