Andhra King Taluka: ఆంధ్రకింగ్ తాలూకా రిలీజ్ డేట్ ఫిక్స్.. మిమ్మల్ని మీరు స్క్రీన్‌పై చూసుకోండి అంటూ పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-08-21 11:57:10  IST  )

హీరో రామ్ పోతినేని (Ram Pothineni), డైరెక్టర్ పి. మహేష్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.

Andhra King Taluka: ఆంధ్రకింగ్ తాలూకా రిలీజ్ డేట్ ఫిక్స్.. మిమ్మల్ని మీరు స్క్రీన్‌పై చూసుకోండి అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: హీరో రామ్ పోతినేని (Ram Pothineni), డైరెక్టర్ పి. మహేష్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). రామ్ కెరీర్ ఎంతో స్పెషల్‌గా రూపొందబోతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతుండగా.. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘స్టార్స్ అభిమానులందరూ సమావేశమవ్వండి.. ఎప్పుడైనా సినిమాలో మిమ్మల్ని మీరూ చూసుకున్నారా? ఈ సంవత్సరం మీ జీవితాన్ని బిగ్ స్క్రీన్‌పై తిరిగి చూడటానికి సిద్ధంగా ఉండండి! ఆంధ్రకింగ్ తాలూకా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది’ అంటూ ప్రకటించారు. లింక్


Next Story