ఆ స్టార్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన రామ్ పోతినేని.. ఎలా బ్రేకప్ అయిందంటే?

by Hamsa |
ఆ స్టార్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన రామ్ పోతినేని.. ఎలా బ్రేకప్ అయిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘RAPO’ సినిమాలో నటిస్తున్నాడు. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అయితే ఇటీవల రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రామ్ బాబాయ్ స్రవంతి రవి కిషోర్ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రామ్ పోతినేని ఒకప్పుడు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమలో పడ్డారని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఉన్నది ఒకటే జిందగీ,హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో నటించారు. ఆ సినిమాల తర్వాత అనుపమ, రామ్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసిందట. అప్పట్లో ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో స్టార్ నిర్మాత దిల్ రాజు అనుపమకు వార్నింగ్ ఇచ్చాడట. ఇలాంటి పనులు చేస్తే హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని చెప్పడంతో రామ్‌కు అనుపమ బ్రేకప్ చెప్పేసిందట. ఒక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుపమ తిరిగి రామ్‌తో నటించలేదు.

Also Read: పెళ్లి విషయంలో కృతిసనన్ ఇంతలా భయపడిందా..

ఈ స్టార్ హీరోయిన్ సక్సెస్‌కు ఆ డైరెక్టర్ ఎఫైరే కారణమా!

Next Story

Most Viewed