ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి క్రేజీ అప్డేట్‌..2 రోజులు ముందుగానే

by velandi.Saikiran |

సినిమాను 2 రోజుల ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కాకుండా అమెరికాలో నవంబర్ 26వ తేదీన ప్రీమియర్ షోలు

ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి క్రేజీ అప్డేట్‌..2 రోజులు ముందుగానే
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో సినిమాలు చేసిన రామ్‌, దేవ‌దాసు సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బంప‌ర్ హిట్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలో వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్లారు రామ్‌. అయితే, ఈ మ‌ధ్య కాలంలో స‌క్సెస్ లేక, రామ్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో రామ్ పోతినేని తాజాగా చేసిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka).

ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్త‌యింది. న‌వంబ‌ర్ 28వ తేదీన రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న ఈ సినిమాకు పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ హీరోగా చేస్తుండ‌గా, భాగ్య శ్రీ హీరోయిన్ గా మెరువ‌నున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను రెండు రోజుల ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కాకుండా అమెరికాలో నవంబర్ 26వ తేదీన ప్రీమియర్ షోలు వేసేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది. మరి ఈ ప్లాన్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Next Story