- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్..రామ్ ఫ్యాన్స్ కు ఇక మాస్ జాతరే
టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కామెడీ అలాగే యాక్షన్ సినిమాలు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కామెడీ అలాగే యాక్షన్ సినిమాలు చేయడంలో రామ్ దిట్ట. అలాంటి రామ్ ఇప్పుడు సరికొత్త మూవీతో తెలుగు పేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీనే ఆంధ్రా కింగ్ తాలూకా ( Andhra King Taluka ). ఈ టైటిల్ లోనే ఊర మాస్ ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. పి మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోంది. నవీన్ ఎర్నేని అలాగే వై.శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వివేక్ మెర్విన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్ సరసన భాగ్యశ్రీ ( Bhagyashri Borse) హీరోయిన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. టీజర్ లో హీరో రామ్ మాస్ అవతారంలో కనిపించాడు. ఓ సూపర్ స్టార్ హీరోకు వీరాభిమానిగా ఇందులో మెరిశాడు. ఆ హీరో కోసం రామ్ తీసుకునే నిర్ణయాల చుట్టూ ఈ సినిమా కథ నడిచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రామ్ నటనలో ఎనర్జీ అలాగే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అటు భాగ్యశ్రీ, రామ్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ టీజర్ తో సినిమాపై హైప్ అమాంతం పెరిగేసింది. కాగా నవంబర్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






