Ram Pothineni: డైరెక్టర్‌గా రామ్ పోతినేని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో

by Chukka Sudharani |

యంగ్ హీరో రామ్ పోతినేని.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది.

Ram Pothineni: డైరెక్టర్‌గా రామ్ పోతినేని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో
X

దిశ, సినిమా: యంగ్ హీరో రామ్ పోతినేని.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు నటుడిగా అలరించిన ఈ హీరో.. ఇప్పుడు డైరెక్టర్‌గా మారనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి హాజరైన రామ్.. తన డైరెక్టోరియల్ డెబ్యూట్‌పై అప్డేట్ ఇచ్చాడు. ‘నేనే ఓ కథ రాస్తున్నాను.. త్వరలోనే దర్శకత్వం వహించబోతున్నాను’ అని ప్రకటించాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్.. ఇప్పుడు డైరెక్టర్‌గా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటాడో అంటున్నారు నెటిజన్లు. కాగా.. రామ్ పోతినేని ప్రజెంట్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Next Story