- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ తో డేటింగ్... హీరో రామ్ సీక్రెట్ లీక్!
హీరో రామ్ పెట్టుకున్న స్పెట్స్.. హీరోయిన్ భాగ్యశ్రీ కూర్చున్న టేబుల్ పైన కనిపించాయి

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. మరికొంతమంది సక్సెస్ కోసం ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు.... ఇప్పటికే సక్సెస్ అయి రాణిస్తున్నారు. అలాంటి వారిలో... హీరో రామ్ ఒకరు. జగడం, దేవదాసు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మారిపోయారు హీరో రామ్ ( Ram Pothineni).
ఇక ఇప్పుడు కూడా తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ తో ( bhagyashri borse ) రామ్ డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి ఈ ఇద్దరు అడ్డంగా దొరికిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరో రామ్ పెట్టుకున్న స్పెట్స్.. హీరోయిన్ భాగ్యశ్రీ కూర్చున్న టేబుల్ పైన కనిపించాయి. అంటే వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తున్నారని... ఫారెన్ వెళ్లి చిల్ అవుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే.. మరికొంతమంది మాత్రం ఇదంతా ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. భాగ్యశ్రీ అలాగే రామ్ కాంబినేషన్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈ ఇద్దరు కలిసి ఉంటారని మరికొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్లిక్
Read More: ఆ హీరో నైట్ పార్టీ.. అడ్డంగా దొరికిపోయిన జాన్వీ !






