- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Pothineni: యంగ్ హీరోయిన్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ రామ్ పోస్ట్.. బేబీ అని ప్రేమను కన్ఫార్మ్ చేశాడంటున్న నెటిజన్లు
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22).

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22). ఈ సినిమా మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. రామ్ పోతినేని, భాగ్యశ్రీతో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ లవ్ బర్డ్స్ వెకేషన్‌కు కూడా వెళ్లినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు రావడంతో రామ్ పోతినేని విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. ఈ సంవత్సరం ప్రేమను,సంతోషాన్ని అందిస్తుంది bb అని రాసుకొచ్చాడు. ఇక అది చూసిన నెటిజన్లు bb అంటే బేబీ అని ప్రేమ కన్ఫర్మ్ చేశాడనే చర్చలు మొదలయ్యాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదు. కాగా భాగ్యశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈ మూవీ హిట్ సాధించనప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం ఫుల్ పాపులారిటీ వచ్చింది. తన నటనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో నిర్మాతలు కూడా ఆమె వరుస సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం భాగ్యశ్రీ రాపో-22తో పాటు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రంలోనూ నటిస్తోంది.






