- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాధలా రెడీ అయిన రామ్ బ్యూటీ.. మరి నీ కృష్ణుడిని ఎప్పుడు పరిచయం చేస్తావంటూ కామెంట్స్
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది.
అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ ఓణీతో పాటు మెరూన్ కలర్ లంగా వేసుకుంది. ఇక సేమ్ టు సేమ్ రాధలా రెడీ అయింది. ఇక ఈ సూపర్ క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘కాంక్రీట్ అడవిలో ఉన్న రాధ - గందరగోళంలో దయను మరియు హడావిడిలో లయను కనుగొంటుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ కృష్ణుడ్ని ఎప్పుడు పరిచయం చేస్తావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






