- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రామ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్
సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపి ప్రజెంట్ అసలు కనిపించకుండా పోయిన వాళ్లు కొంత మంది ఉంటే.. ఒక్క సినిమా మాత్రమే చేసి వెండి తెరకు దూరమయ్యే వాళ్లు మరికొంత మంది.

దిశ, సినిమా: సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపి ప్రజెంట్ అసలు కనిపించకుండా పోయిన వాళ్లు కొంత మంది ఉంటే.. ఒక్క సినిమా మాత్రమే చేసి వెండి తెరకు దూరమయ్యే వాళ్లు మరికొంత మంది. అలా దూరం అయిన వారు అప్పడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చి షాక్‌ను గురి చేస్తుంటారు. వాళ్లని చూసినప్పుడు అసలు ఆ మూవీలో నటించింది ఈమెనే అని ఆశ్చర్యం కలగకమానదు. అలా ఓ హీరోయిన్ కూడా ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ కనిపించి షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఏంటి విశేషాలు..? అనేది ఇప్పుడు మనం చూద్దాం..
లవర్ బాయ్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ‘జగడం’(Jagadam). ఈ మూవీలో రామ్ సరసన ఇషా సహాని(Isha Sahani) నటించింది. అయితే సినిమా ప్లాప్ అయినా కూడా ఈ బ్యూటీ తన అందంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అప్పట్లో ఆమె అందానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే జగడం సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి సైతం తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ఇక ఈ సినిమా తర్వాత మరో మూవీలో కనిపించలేదు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఈ భామ ప్రజెంట్ లుక్‌ను చూసి షాక్ అవుతూ ఆమె ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుని ఇషా లండన్‌లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ డ్యాన్స్ స్కూల్ నడుపుతుంది. మరి ప్రజెంట్ ఇషా సహాని ఎలా ఉందో ఈ ఫొటోస్ చూసి తెలుసుకోండి.






