- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
nabhanatesh: ఊహించని గెటప్‌లో దర్శనమిచ్చిన రామ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సుమంత్ శైలేంద్ర (Sumanth Sailendra) సరసన లీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తర్వాత అదే ఏడాది సభా నటేష్ సాహెబా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఓ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసి యువతను ఫిదా చేసిందనడంలో అతిశయోక్తిలేదు. తర్వాత సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాలో నటించి మెప్పించింది.
బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వసూళ్ల విషయంలో కూడా దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఈ దెబ్బకు ఈ ముద్దుగుమ్మకు రవితేజతో నటించే చాన్స్ సంపాదించుకుంది. డిస్కో రాజా (Disko raja) సినిమా కోసం దర్శక నిర్మాతలు ఈ భామను అప్రోచ్ అయ్యి.. కథానాయికగా ఎంపిక చేశారు. తర్వాత సోలో బ్రతుకే సో బెటర్లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
తెలుగులో కాకుండా ఈ అమ్మడు కన్నడలో కూడా తన ప్రతిభ చూపించింది. లీ, వజ్రకాయ (Vajrakayal, అధుగో (Adhugo), సాహెబా (Saheba).. అలాగే డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ (Alludu adurs), డార్లింగ్ (Darling) వంటి సినిమాల్లో నటించింది.
ఇకపోతే సభా నటేష్ తాజాగా తన అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ బ్యూటీ ఒంటినిండా సంప్రదాయ బట్టల్లో కనిపించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.instagram link






