Ram Gopal Varma: అగ్ర కథానాయకుడిపై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

by Kodari Anjali |

ఎదున్నా ఓపెన్‌గా మాట్లాడి.. జనాల్ని ఆకట్టుకుంటారు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma: అగ్ర కథానాయకుడిపై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదున్నా ఓపెన్‌గా మాట్లాడి.. జనాల్ని ఆకట్టుకుంటారు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఈ డైరెక్టర్‌కు కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. వర్మ చెప్పేవన్నీ వాస్తవాలేనని.. జీవిత సత్యాలని చాలామంది అంటుంటారు. నిత్యం వివాదాలతో సావాహం చేస్తుంటాడని కొంతమంది తిట్టుకునే వాళ్లుండగా.. మరికొంతమంది రామ్ గోపాల్ వర్మ చెప్పేవన్నీ నిజాలంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు.

ఇక రామ్ గోపాల్ వర్మ శారీ(Shari) మూవీని తీస్తున్న విషయం తెలిసిందే. గిరి కృష్ణకమ్(Giri Krishnakam) దర్శకత్వంలో, వర్మ, ఆర్వి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ (Ravi Shankar Varma)నిర్మిస్తోన్న ఈ మూవీ నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఆరాధ్య దేవి అండ్ సత్య యాదు.. హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుగా రానుంది. తమిళం తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ నెల (ఫిబ్రవరి) 28 వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు విడుదలై.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

ఇకపోతే తాజాగా రామ్ గోపాల్ వర్మ మలయాళ ప్రముఖ హీరో మోహన్‌లాల్(Mohanlal) పై ప్రశంసలు కురిపించారు. వీరి కలయికలో వచ్చిన ‘కంపెనీ’ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్ట్రిప్ట్ మోహన్ లాల్‌కు చెప్పినప్పుడే నేను ఆయన్ను కలవడం మొదటిసారి అని తెలిపారు. కథ మొత్తం చెప్పేవరకు ఆయన ఏం మాట్లాడలేదని.. లాస్ట్‌కు ఎన్ని డేస్ చిత్రీకరణ జరుపుతారని మాత్రమే అడిగారు. అది నాకు నిజంగా అస్సలు ఊహించలేదని చెప్పారు. ఆ హీరోకు సినిమాలపై అవగాహన ఉంది కాబట్టే డైరెక్టర్లందరితో మంచిగా బిహెవ్ చేస్తారని.. మాటతీరు నచ్చిందని చెప్పుకొచ్చారు.

మోహన్ లాల్ సహజ నటుడు అని ఆర్జీవీ కొనియాడారు. డైరెక్టర్లను ఆయన నమ్ముతారని తెలిపారు. కానీ కంపెనీ సినిమా షూటింగ్ అప్పుడు ఓ సన్నివేశంలో మోహన్ లాల్ ప్రదర్శన కాస్త నచ్చలేదని చెప్పుకొచ్చారు. దాదారు ఏడు, ఎనిమిది టేకులు తీసుకున్నారు. కానీ ఫస్ట్ టేక్‌లోనే బాగా చేశారని అనిపించిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈయన సహజంగా నటిస్తారని అన్నారు. ఓ సన్నివేశం గురించి క్లారిటీ ఇస్తే చాలు.. డైరెక్టర్ ఏ విధంగా చేయించాలనుకుంటున్నాడో అలానే చేస్తారని వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story