Ram Charan: రామ్ చరణ్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేదు అదే నా బాధ.. ఇష్యూపై తమన్ క్లారిటీ

by Chukka Sudharani |

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై ప్రజెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

Ram Charan: రామ్ చరణ్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేదు అదే నా బాధ.. ఇష్యూపై తమన్ క్లారిటీ
X

దిశ, సినిమా: మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై ప్రజెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ‘గేమ్ చేంజర్’ పాటలకు హుక్ స్టెప్పులు లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఆ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తమన్. ‘రామ్ చరణ్ పెద్ద డ్యాన్సర్. తొలి సినిమాతో మొదలు ‘నాయక్‌లోని లైలా ఓ లైలా’, బ్రూస్‌లీ లోని మెగా మెగా మీటర్ లాంటి ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు చర్రీ.

అలాంటి ఆయన ఎనర్జీకి కొరియోగ్రాఫర్లు సరైన మూమెంట్స్ ఇవ్వలేకపోయారని ఇటీవల అన్నాను. ఆ కామెంట్స్‌ను కొందరూ హీరోని టార్గెట్ చేసి మాట్లాడానని తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘గేమ్ చేంజర్’ విషయంలో రామ్ చరణ్ డ్యాన్స్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేకపోయాన్నదే నా బాధ.. అంతే కానీ వేరే ఉద్దేశ్యంతో నేను అనలేదు. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. అందుకే ఆయన్ని నేను మెగా హార్ట్ స్టార్ అని పిలుస్తాను. ఓజీ మ్యూజిక్ గురించి కూడా రామ్ చరణ్ నాతో ప్రత్యేకంగా మాట్లాడారు’ అంటూ తెలిపాడు తమన్.

Next Story