మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ అప్డేట్ అదిరింది!

by Sujitha Rachapalli |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పోస్టర్లు, గ్లింప్స్, చికిరి సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కాగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చెర్రీ, ఇతర ఫైటర్లతో కీలక

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ అప్డేట్ అదిరింది!
X

దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పోస్టర్లు, గ్లింప్స్, చికిరి సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కాగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చెర్రీ, ఇతర ఫైటర్లతో కీలక పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా భారీ సెట్‌ వేయగా.. బాలీవుడ్ ప్రముఖ స్టంట్ డైరెక్టర్ శామ్ కౌశల్ పర్యవేక్షణలో ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కుతోంది. ఈ హై ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌ కానుందని.. అందుకే మేకర్స్ శామ్ కౌశల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. ఇక వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత కాగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తుంది. కాగా ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా.. మార్చి 27, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Next Story