- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్ అప్‌డేట్.. అక్కడ హై-రిస్క్ అండ్ హై-ఆక్టేన్ స్టంట్‌లో పాల్గొన్న మెగా హీరో.. ఫొటో వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’(Peddi).

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’(Peddi). బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాగా.. 30శాతం కంప్లీట్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
పెద్ది తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad)లో జరుగుతోందట. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు ప్రయత్నించిన అత్యంత సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలలో ఒకదాన్ని చిత్రీకరించడానికి ప్రత్యేకంగా ఒక భారీ రైలు సెట్‌ను కూడా మేకర్స్ నిర్మించారట. అయితే రామ్‌చరణ్ నటించిన ఈ హై-రిస్క్, హై-ఆక్టేన్ స్టంట్ సీక్వెన్స్‌ను అపూర్వమైన స్థాయిలో చిత్రీకరించారట. అయితే ఈ నెల 19 వరకు ఈ షూటింగ్ కొనసాగుతుందట. కాగా ఈ మూవీ మార్చి 27, 2026న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలో విడుదల కానుంది.






