- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ చేతికి గాయం..షాకింగ్ వీడియో వైరల్ !
Peddi Movie: రామ్ చరణ్ చేతికి గాయమైన షాకింగ్ వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నింపారు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు గాయంతోనే రామ్ చరణ్ హాజరయ్యారు. ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉన్నట్లు వీడియో కూడా వైరల్ గా మారింది.
అంతేకాదు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆ గాయం గురించి రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 35 నుంచి 45 రోజులుగా పెద్ది కోసం తాము పెహల్వాన్ షూటింగ్ చేశామని వివరించారు. వెల్ ట్రైన్డ్ వాళ్లను తీసుకురావాలని తాను చెప్తే, అతడు నిజంగానే రియల్ పెహల్వాన్లను బరిలోకి దించాడని చెప్పుకొచ్చారు. అయితే వాళ్లు గట్టిగా తన చేయి పట్టుకోవడంతో చిన్న గాయమైందని వివరించారు. అయినా ఇది ఎంతో వర్త్.. పెద్ది సినిమాకు గుర్తుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా ఈ పెద్ది సినిమాను జూన్ 4వ తేదీన రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది బుచ్చిబాబు టీమ్. క్లిక్






