- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ బర్త్‌డే మై సోల్ మేట్ అంటూ అతనికి విష్ చేసిన రామ్ చరణ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
‘భరత్ అనే నేను’(Bharat Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: ‘భరత్ అనే నేను’(Bharat Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తోంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుబ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటూ 2023లో పెళ్లి కూడా చేసుకుంది.
ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలను మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. తాజాగా కియారా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తన భర్తతో(Husband) దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై సోల్‌మేట్’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






