కింద కూర్చుని మరీ ఆ పని చేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ.. క్యాప్షన్ మీరే చెప్పండంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-10 02:46:24  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

కింద కూర్చుని మరీ ఆ పని చేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ.. క్యాప్షన్ మీరే చెప్పండంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కెసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఒక పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రకుల్ ప్రీత్ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. లూజ్ టీ షర్ట్‌లో కింద కూర్చుని సోఫా మీద హ్యాండ్ పెట్టి ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాకుండా ‘ఈ పిక్స్‌కి క్యాప్షన్ పెట్టండి.. మంచి క్యాప్షన్ పెట్టిన వారికి రిప్లై లభిస్తుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు తమకు నచ్చిన క్యాప్షన్ పెడుతున్నారు.

(Post and Credit's to Rakul Preet Singh Official Instagram)

Next Story