- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటూ అదిరిపోయే ఫొటోలు పంచుకున్న రామ్ చరణ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు.
ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నాని(Jockey Bhagnany)తో ప్రేమలో పడి షికార్లు చేసింది. ఇక గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ‘ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు మీరు మీ జీవితంలో రోజువారీ పద్ధతులుగా అమలు చేయగల కొన్ని సులభమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి’ అని రాసుకొస్తూ కొన్ని ఫుడ్ తింటున్న ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..






