- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోమ్ బాడీ క్లబ్ అంటూ బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన రామ్ చరణ్ బ్యూటీ.. ఇదేం పిచ్చి వేశాలంటూ నెటిజన్లు ఫైర్
‘ఎవడు’(Yevadu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్(Amy Jackson) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఎవడు’(Yevadu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్(Amy Jackson) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘ఐ’(I), ‘రోబో’(Robo), ‘నవమన్మధుడు’(Nava Manmadhudu) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక నటన, తన అందంతో అలరించినప్పటికీ ఈ చిత్రాల తర్వాత తెలుగులో మళ్లీ నటించలేదు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ భామ ఓ వ్యక్తితో డేటింగ్ చేసింది. కానీ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయింది ఈ బ్యూటీ.
ఇక రీసెంట్‌గా హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్(Ed Vestvik)ను మ్యారేజ్ చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లి ఫొటోలు తన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక ఈ భామ రెండో సారి తల్లి కాబోతుంది. ఈ విషయం కూడా ఈ బ్యూటీ ఇన్‌స్టా గ్రామ్(Instagram) ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటో షూట్స్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా అమీ జాక్సన్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పొట్ట మొత్తం కనిపించేటట్టు టీ షర్ట్ పైకి అనుకొని బేబీ బంప్ కనబడేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా తన ఫస్ట్ బాబుతో కూడా కొన్ని పిక్స్ దిగింది. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘హోమ్ బాడీ క్లబ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అలా పొట్ట కనిపించేటట్టు, అది కూడా కన్న కొడుకు ముందు ఏంటా పిచ్చి వేశాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






