- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామ్ అండ్ సింపుల్ లుక్‌లో రామ్ చరణ్ బ్యూటీ.. వావ్ బ్యూటిఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
మరో పక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రకుల్ ప్రీత్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. మరీ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ అండ్ కామ్ లుక్‌లో కనిపించింది. ఇక వీటికి.. ‘ప్రశాంతత, సరళత, నిర్మలం’ అని రాసుకొస్తూ వైట్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.






