- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన రామ్ చరణ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోతారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోతారు. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా సడెన్‌గా మరో చిత్రం చేయకుండా ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలా ఒకే ఒక్క మూవీతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిన ఈ హీరోయిన్ ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కింది. మరి ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ షాజన్ పదంసీ(Shajan Padamsi). బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’(Orange).
అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇందులో మెయిన్ హీరోయిన్‌గా జెనీలియా(Genelia) నటించగా, ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా షాజన్ పదంసీ నటించింది. అయితే సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారును కవ్వించింది. తర్వాత ‘మసాలా’(Masala) సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. గ్రాండ్‌గా ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఏడడుగులు వేసింది. మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియాతో ఈ ఏడాది జనవరిలో రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. తాజాగా వీరి వివాహం కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఇక ఈ విషయాన్ని ఈ జంట అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్ షేర్ చేశారు. అయితే ఈ ఫొటోస్‌కు ‘ఈ రోజు.. ఈ అనుభూతి.. మాది ఎప్పటికీ అనంతం&లవ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






