Ram Charan: హ్యాండ్‌సమ్ లుక్‌లో దర్శనమిచ్చిన గ్లోబల్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |
Ram Charan: హ్యాండ్‌సమ్ లుక్‌లో దర్శనమిచ్చిన గ్లోబల్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’(Game Changer). దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి(Anjali), సునీల్(Sunil), సముద్ర ఖని(Samudrakani), ఎస్ జె సూర్య(SJ Surya), శ్రీకాంత్(Srikanth) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా రీసెంట్‌గా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ కూడా రిలీజ్ అయింది. కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడిన ‘నానా హైరానా’ సాంగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ స్వరాలు సమకూర్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టాడు. అందులో వైట్ అండ్ వైట్ డ్రెస్‌ వేసుకొని బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని సూపర్ స్టిల్ ఇచ్చాడు. అంతే కాకుండా ఈ పిక్‌కు ‘నానా హైరానా’ సాంగ్‌‌ను, ‘గేమ్ ఛేంజర్’ మూవీను ట్యాగ్ చేశాడు. అయితే ఈ ఫొటోలో రామ్ చరణ్ చాలా హ్యాండ్ సమ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed