- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: చాలా దూరంలో రామ్ చరణ్... పాపం దారుణమైన పరిస్థితి..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల అయిన థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ..

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ Game Changer) సినిమా విడుదల అయిన థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. తొలి షో నుంచే సినిమాపై ప్రేక్షకులు భిన్న స్పందనలు కనబర్చారు. దీంతో ఈ సినిమా వసూళ్లపై అందరి దృష్టి పడింది. తొలి రోజు సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చాయనే సస్పెన్స్ నడిచింది. అయితే చిత్ర యూనిట్ తొలి కలెక్షన్లపై స్పష్టత ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్లు రాబట్టినట్లు వెల్లడించారు.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్పా-2’ మూవీ(Puspa-2 Movi) తొలి రోజు కలెక్షన్లను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పుష్పా-2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు వసూలు చేసినట్లు అప్పట్లో సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌ను కలిపి పోస్ట్ చేసి సెటైర్లు వేస్తున్నారు. పుష్ప-2ని (రూ.294 కోట్లు) బీట్ చేసే స్థాయిలో కలెక్షన్లు వస్తాయనుకుంటే రూ. 100 కోట్లకు పైగా తేడాతో రూ.186 కోట్లకే గేమ్ ఛేంజర్ పరిమితమైందంటూ విమర్శలు కురిపిస్తున్నారు.






