- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: సతీష్ కిలారు గారు సెట్‌కు వచ్చి టీ తాగి వెళ్లే నిర్మాత కాదు
సతీష్ కిలారు సెట్‌కు వచ్చి టీ తాగి, లంచ్ చేసి వెళ్లే వ్యక్తి కాదని, షూటింగ్ జరిగే ప్రతి రోజూ ఆయన మాతో పాటు సెట్‌లోనే ఉన్నారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: నిన్న రాత్రి విజయవాడలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారీ స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ... ఒక నటుడిగా మేము అనేక కథలను వింటూ ఉంటాం.
అందులో కొన్ని కథలు బాగున్నాయి అనిపిస్తాయి, మరికొన్ని ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తాయి. కానీ చాలా తక్కువ కథలు మాత్రమే మనసును తాకుతాయి. అలాంటి కథల్లో ‘పెద్ది’ ఒకటి” అని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా కథను దర్శకుడు బుచ్చిబాబు తనకు చెప్పినప్పుడు తాను కొంతసేపు షాక్ అయ్యానని, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని ఆశ్చర్యపోయానని రామ్ చరణ్ అన్నారు. కొన్ని సంవత్సరాల్లోనే బుచ్చిబాబు ఇండియాలో టాప్ 3 లేదా టాప్ 4 డైరెక్టర్లలో ఒకరిగా నిలుస్తారు, ఇది రాసిపెట్టుకోండి అని ఆయన విశ్వాసంగా చెప్పుకొచ్చారు.
ఇక నిర్మాత వెంకట సతీష్ కిలారు గురించి మాట్లాడుతూ ఆయన పనితీరును రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన అద్భుతమైన నిర్మాత. ఇది ఆయనకు మొదటి సినిమా అయినప్పటికీ 50 సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పెద్ద ఇన్ఫ్రా కంపెనీ ఉన్నప్పటికీ ఎప్పుడూ సెట్‌లోనే ఉండేవారు. చాలామంది నిర్మాతల మాదిరిగా వచ్చి కాఫీ తాగి, లంచ్ చేసి వెళ్లే వారు కాదు. సినిమా షూటింగ్ జరిగిన ప్రతి రోజూ మాతోపాటే ఆయన కూడా ఉన్నారని చరణ్ పేర్కొన్నారు. చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.






