హిట్ డైరెక్టర్‌తో యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్న రామ్ చరణ్.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు

by Hamsa |
హిట్ డైరెక్టర్‌తో యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్న రామ్ చరణ్.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హిట్ కోసం తాపత్రయ పడుతున్నారు. ఇటీవల ‘గేమ్ చేంజర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ హిట్ సాధించలేకపోయారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రజెంట్ ఆయన బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్యేందు శర్మ వంటి స్టార్ నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే గ్లోబల్ స్టార్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

హిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో రామ్ చరణ్ ఓ యాక్షన్ పాక్డ్ థ్రిల్లర్‌ను చేయబోతున్నట్లు టాక్. అయితే ఈ సినిమాకు ‘డెవిల్’ టైటిల్ పెట్టాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు అస్సలు ఆ కాంబోను ఊహించలేదని అదిరిపోయిందని అంటున్నారు. కాగా, యానిమల్, అర్జు్న్ రెడ్డి వంటి హిట్స్‌తో బాక్సాఫీసును షేక్ చేశారు సందీప్ రెడ్డి వంగా. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Next Story

Most Viewed