రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. సందీప్ రెడ్డి వంగా మూవీ అప్డేట్

by Gantepaka Srikanth |

గేమ్ ఛేంజర్(Game Changer) ఫలితంతో నిరాశలో ఉన్న రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ గుడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. సందీప్ రెడ్డి వంగా మూవీ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: గేమ్ ఛేంజర్(Game Changer) ఫలితంతో నిరాశలో ఉన్న రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ గుడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ - సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్‌ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. ఇటీవలే చరణ్‌ను సందీప్ కలిసి స్టోరీ చెప్పాడట. రామ్ చరణ్ కూడా స్టోరీకి ఇంప్రెస్ అయి ఓకే చెప్పేశాడట. సుకుమార్(Sukumar) సినిమా తర్వాత సందీప్‌తో రామ్ చరణ్ మూవీ మొదలెట్టనున్నాడు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్.. ఉప్పెన ఫేమ్ బుబ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యంగ్ హీరో, మీర్జాపూర్ సిరీస్‌తో ఫేమస్ అయిన మున్నాభాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే, ఇటీవల తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రం అభిమానులను నిరాశకు గురి చేసింది. చరణ్ సినిమా కోసం ఆరేళ్లు ఎదురు చూసిన అభిమానులు ఫలితం చూసి షాకయ్యారు. రామ్‌నంద‌న్ (రామ్‌చ‌ర‌ణ్) ఓ యువ ఐపీఎస్ అధికారి. కాలేజీలో త‌ను ప్రేమించిన దీపిక‌ (కియారా అద్వానీ) కోసం వ్య‌క్తిత్వాన్ని మార్చుకుంటాడు. త‌న‌లో కోపాన్ని త‌గ్గించుకుంటాడు. ఆమె కోస‌మే ఐపీఎస్‌ నుంచి ఐఏఎస్ అవుతాడు. విశాఖ కలెక్టర్‌గా బాధ్య‌త‌లు తీసుకోగానే మినిస్ట‌ర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని గ్యాంగ్‌తో యుద్ధం చేస్తాడు. రాజకీయాలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య జరిగే యుద్ధాన్ని దర్శకుడు శంకర్ చాలా చక్కగానే చూపించారు. రామ్ చరణ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. కానీ ఒక వర్గం కావాలనే సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల సినిమాకు ఫైనాన్షియల్‌గా నష్టం జరిగిందని అన్నారు.

కాగా, గేమ్‌ ఛేంజర్‌‌లో నటి అంజలి, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవీన్‌ చంద్ర, వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.


Next Story