- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వారెవ్వా.. ఏం స్క్రిప్ట్ సెలక్షన్ బ్రదర్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’: ఆ హీరోపై రామ్ చరణ్ ప్రశంసలు
నాచురల్ స్టార్ నాని(Natural Star Nani) ప్రధాన పాత్రలో నటించిన హిట్ - 3 చిత్రం థియేటర్లలో అదరగొడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని(Natural Star Nani) ప్రధాన పాత్రలో నటించిన హిట్ - 3 చిత్రం థియేటర్లలో అదరగొడుతోంది. పాజిటివ్ టాక్‌తో నిర్మాతలకు భారీ కలెక్షన్లు తెచ్చిపెడుతోంది. విడుదలైన రెండ్రోజుల్లో రూ.60 కోట్ల వరకు కలెక్ట్ చేసి నాని కెరియర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలవబోతున్నట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) వీక్షించారు. సినిమాపై తనకు ఏర్పడిన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘హిట్-3 చిత్రంపై ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌లు కొడుతున్న నా ప్రియమైన సోదరుడు నానికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శైలేశ్ కొలను(Sailesh Kolanu)కు హాట్యాఫ్. చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో రామ్ చరణ్ పేర్కొన్నారు.
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని(Prashanti Tipirneni) నిర్మించారు. ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ప్రీ బుకింగ్స్‌లోనే హవా చూపించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతోంది. ఓవర్సీస్‌లో తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ వారాంతంలోనే రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.






