- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పెద్ది' గ్లింప్స్ రిక్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. రామచరణ్ రియాక్షన్ ఇదే..
రామ్‌చరణ్ క్రేజ్‌కి క్రికెట్ కూడా సెల్యూట్ చేస్తుందంటే, నమ్మాల్సిందే.. ‘పెద్ది’ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన గ్లింప్స్ వీడియోలో ఆయన చేసిన సిగ్నేచర్ షాట్ సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: రామ్‌చరణ్ క్రేజ్‌కి క్రికెట్ కూడా సెల్యూట్ చేస్తుందంటే, నమ్మాల్సిందే.. ‘పెద్ది’ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన గ్లింప్స్ వీడియోలో ఆయన చేసిన సిగ్నేచర్ షాట్ సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అదే ఇప్పుడు ఐపీఎల్ మైదానాల్లోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక ఆసక్తికర సర్ప్రైజ్ ఇచ్చింది. రామ్‌చరణ్ ‘పెద్ది’ షాట్‌ను రీక్రియేట్ చేస్తూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. పెద్ది మాస్ ఎనర్జీకి క్రికెట్ మ్యాజిక్ కలిసిన ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానులు దీన్ని తెగ షేర్ చేస్తూ ఢిల్లీ జట్టును అభినందిస్తున్నారు. మరోవైపు, “ఇలాంటి చెలాకీ సన్‌రైజర్స్ ఎందుకు చేయలేకపోయారు?” అంటూ ట్రోల్స్ కూడా ముస్తాబయ్యాయి.
ఇంతకీ ఈ రసవత్తర కంటెంట్ టైమింగ్ ఏమిటంటే – నేడు హైదరాబాద్‌లో SRH vs DC మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఢిల్లీకి ఇది కీలక మ్యాచ్. 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ, 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ మధ్య పోరు హై వోల్టేజ్‌గా ఉండబోతోంది. ఇదిలా ఉంటే… బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ మూవీపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్నారు. 2026 మార్చి 27న ‘పెద్ది’ థియేటర్లలో విడుదల కానుంది. ఓ మాటలో చెప్పాలంటే… రామ్‌చరణ్ మాస్ స్టైల్‌కి ఇప్పుడు క్రికెట్ కూడా ఫ్యాన్ అయ్యింది..






