- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Peddi: రాంచరణ్ మూవీలో ఐటెం సాంగ్..రంగంలోకి డిజాస్టర్ భామ !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పెద్ది సినిమాతో ( Peddi) ఫుల

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పెద్ది సినిమాతో ( Peddi) ఫుల్ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో పెద్ది సినిమాలో ఐటెం సాంగ్ ( Item song) ఉంటుందని... అందులో ఓ హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ఐటెం సాంగ్ కోసం మొదట శ్రీ లీలాను అనుకున్నారట. కానీ చివరికి ఆమెను కాదని పూజ హెగ్డేను ( Pooja Hegde) ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో జిగేల్ రాణి ఐటెం సాంగ్ లో కూడా పూజ హెగ్డే నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ సెంటిమెంట్ ను పెద్ది సినిమాలో.. వాడుకోవాలని చూస్తున్నారు. డిజాస్టర్ హీరోయిన్ అయినప్పటికీ పూజ హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






