PEDDI: "పెద్ది" నుంచి ఫస్ట్ షాట్.. ఇక చరణ్ అన్ని సిక్సులే !

by velandi.Saikiran |   (  Updated:2025-08-26 12:24:59  IST  )

శ్రీరామనవమి పండుగ రోజున మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram

PEDDI: పెద్ది నుంచి ఫస్ట్ షాట్.. ఇక చరణ్ అన్ని సిక్సులే !
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పండుగ రోజున మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan) చేస్తున్న కొత్త సినిమా పెద్ది ( Peddi Movie ) నుంచి.. అదిరిపోయే ఊర మాస్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ పేరుతో క్రేజీ అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమా క్రీడా నేపథ్యంలోనే వస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ షార్ట్ వీడియోలో... రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అంతేకాదు భారీ సిక్స్ కొట్టిన విజువల్స్ కూడా మనం.. ఇందులో చూడవచ్చు.


ఇక తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో రామ్ చరణ్ అదిరిపోయే డైలాగులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఒకే పని చేయడానికి, ఒకేలా బతకడానికి ఇంత పెద్ద బతికెందుకు.. ఏదైనా ఈ నేలపైన ఉన్నప్పుడే చేసేయాలి.. అంటూ అదిరిపోయే డైలాగులతో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో.. రామ్ చరణ్ పేరు పెద్ది అని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 27వ తేదీన రిలీజ్ కానుంది.

ఇది ఇలా ఉండగా... రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను... దర్శకుడు బుచ్చిబాబు చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన... హీరోయిన్ జాన్వి కపూర్ ( Janhvi Kapoor ) నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో... జగపతి బాబు ( Jagapathi Babu) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పెద్దిసినిమాకు ( Peddi Movie ) ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక అటు ఈ సినిమా షూటింగ్ శరావేగంగా కొనసాగుతోంది.



Next Story