- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది షూటింగ్ అప్డేట్...ఇక మిగిలింది క్లైమాక్స్, ఐటెం సాంగే?
Peddi డిసెంబర్ 18 వతేదీ నుంచి ఢిల్లీ షూట్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఆ తర్వాత క్లైమ్యాక్స్, ఫైటింగ్, ఐటెం సాంగ్

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోన్నారు. దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్న జాన్వీ, ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి.
అయితే, అలాంటి పెద్ది సినిమా షూటింగ్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫ్రెష్ షూటింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుందట. కోటీ ఆస్పత్రి, వన్ స్టూడియో పరిసరాల్లో ఈ షూట్ నిర్వహించనున్నారని టాక్ నడుస్తోంది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 4 రోజుల పాటు షూట్ ఉంటుందట. డిసెంబర్ 18 వ తేదీ నుంచి ఢిల్లీ షూట్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఆ తర్వాత క్లైమ్యాక్స్, భారీ ఫైట్ సీన్, ఐటెం సాంగ్ షూట్ ఉంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ గా మారింది. కాగా ఈ మూవీ 2026 మార్చి 27వ తేదీన రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.






