‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించబోతున్న రామ్ చరణ్..?

by Disha Web Desk 6 |
‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించబోతున్న రామ్ చరణ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో రాబోతున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ అంచనాలు పెంచేశాయి. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా శంకర్ తీర్చి దిద్దుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అంతేకాకుండా చరణ్‌ చేత శంకర్ ఏకంగా ఏడు విభిన్నమైన గెటప్స్‌ వేయించనున్నాడట. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read More: ఎనిమిది నెలల్లోనే అసలు రంగు బయటపెట్టిన హీరోయిన్..


Next Story