- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan:ఎవరు ఊహించని నిజం.. పవన్ కళ్యాణ్ మూవీలో రామ్ చరణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్స్ ఫాలొయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ సినిమా అంటే చాలు యూత్‌లో క్రేజ్ మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సూపర్, బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘అత్తారింటికి దారేది’ మూవీ కూడా ఉంది. ఇక ఆ మూవీ రిలీజైన సమయంలో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని అభిమానులు చెబుతున్నారు. సినీ ప్రియులు కూడా టీవీలో ఈ మూవీ ఎన్ని సార్లు వచ్చినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని అంటున్నారు.
దీంతో ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ఇక్కడే అర్ధం అవుతుంది. అయితే ఈ మూవీ రిలీజై ఇన్నేళ్లు గడుస్తున్న తర్వాత ఈ మూవీ గురించి ఎవరు ఊహించని నిజం బయటకు వచ్చింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌తో పాటు మరో హీరో కూడా ఉన్నట్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ మూవీలో ఎవరు ఊహించని విధంగా మెగా హీరో దర్శనమిస్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మెగా హీరో కూడా ఉంటాడంట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈ రహస్యం బయటపెట్టాడు. అసలు విషయంలోకి వెళితే.. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కదిలించింది.
పవర్ స్టార్ లాంటి హీరోలతో ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చేయడం అంటే.. త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా అని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే క్లైమాక్స్ సన్నివేశంలో ‘నదియా పవన్ కళ్యాణ్‌తో నాన్నకు ఫోన్ చేయరా గౌతం’ అనే సీన్ లో వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక షాడో కనిపిస్తుంది. ఆ షాడో మరెవరిదో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan)ది అంట. బాబాయ్ షూటింగ్ చూద్దామని రామ్ చరణ్ ఆ రోజు అక్కడికి వచ్చారంట. ఈ సమయంలో ఫోన్ రావడంతో సెట్ బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్న రామ్ చరణ్ అనుకోకుండా ఆ సీన్ లో కనిపించాడు. ఇన్నాళ్లకు ఈ విషయం బయటపడటంతో బాబాయి అబ్బాయి నిజంగానే స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.






