- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: సిగ్గుతో మైనపు బొమ్మ వద్దనుకున్నాను.. చివరకు ఉపాసన ఐడియా వర్కౌట్ అయింది
రామ్ చరణ్ మాట్లాడుతూ… లండన్‌లో నా మైనపు విగ్రహాన్ని పెడతామని చెప్పినప్పుడు నేను కాస్త సంకోచించాను. కానీ నాతో పాటు రైమ్‌ను కూడా భాగంగా చేస్తామని చెప్పిన తర్వాత నేను అందుకు ఒప్పుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన మైనపు విగ్రహాన్ని లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విగ్రహాన్ని 2025 మే 9న ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, రామ్ చరణ్‌తో పాటు అతని పెంపుడు కుక్క ‘రైమ్’ బొమ్మను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా రామ్ చరణ్ ఈ మైనపు బొమ్మ విగ్రహానికి సంబంధించిన ప్రపోజల్ తనకు వచ్చినప్పుడు ఏమి జరిగింది అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మాట్లాడుతూ… లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తన మైనపు విగ్రహాన్ని పెడతామని ప్రపోజల్ నా దగ్గరకు తీసుకువచ్చిన సమయంలో నేను కొంచెం సంకోచించాను.
అదే సమయంలో అది నాకు కాస్త సిగ్గుగా కూడా అనిపించింది. అందుకే వారు అడిగిన వెంటనే నేను పాజిటివ్‌గా స్పందించలేదు. వారు చివరకు కొంత మేర అసహనంతో నా భార్య ఉపాసనను ఈ విషయమై సంప్రదించారు. ఆమె మాత్రం చాలా సింపుల్‌గా దానికి ఒక పరిష్కారం చెప్పింది. రామ్ చరణ్‌తో పాటు ‘రైమ్’ (తన పెంపుడు కుక్క)ను కూడా ఇందులో భాగం చేస్తామని చెప్పితే చరణ్ అందుకు ఒప్పుకుంటాడని ఆమె సూచించింది. ఆమె చెప్పినట్లే వారు నాకు ఆ ప్రపోజల్ వినిపించగా నేను వెంటనే దానికి ఒప్పుకున్నాను. దాంతో కొన్ని రోజులకే నేను లండన్‌కు వెళ్లి కొలతలు ఇచ్చాను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.






