Ram Charan: డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న గ్లోబల్ స్టార్.. ఆ టైంకి కలుసుకుందాం అంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘పెద్ది’(Peddi).

Ram Charan: డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న గ్లోబల్ స్టార్.. ఆ టైంకి కలుసుకుందాం అంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘పెద్ది’(Peddi). ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings), రిద్ది సినిమాస్(Riddi Cinemas) బ్యానర్స్ పై భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ మూవీలో స్టార్ యాక్టర్ జగపతిబాబు(Jagapathi Babu), శివన్న(Shivanna) కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ స్టోరీ పెట్టాడు. అందులో ‘పెద్ది సినిమా ఫస్ట్ షాట్ డబ్బింగ్ కంప్లీట్ అయింది. రేపు మార్నింగ్ 11:45 నిమిషాలకు కలుసుకుందాం’ అని రాసుకొస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో ఉన్నా ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా శ్రీరామ నవమి(Sriramanavami) స్పెషల్‌గా పెద్ది సినిమా నుంచి గ్లింప్స్(Glimps) రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Next Story