Ram Charan: పెద్ది సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. ఈగర్‌గా వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-09-01 16:06:46  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీతో బిజీగా ఉన్నాడు.

Ram Charan: పెద్ది సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. ఈగర్‌గా వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌కు కూడా విశేష స్పందన లభించింది. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ మేరకు పెద్ది ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్ ఇస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఓ ఫొటో షేర్ చేశాడు. ‘ఏఆర్ రెహమాన్‌తో పెది మ్యూజికల్ ఫైర్ స్టార్ట్.. ఈ మాస్ట్రో సోల్ అండ్ ఎమోషన్స్‌తో ఇంతకు ముందు ఎన్నడూ లేని ఓ పెద్దిని సృష్టించబోతున్నాడు. మా మొదటి సింగిల్ త్వరలో వస్తుంది.. వేచి ఉండండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ కాంబో అదుర్స్.. ఈగర్‌గా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.లింక్

Next Story