- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదల.. అంచనాలకు మించిపోయిందిగా.. (వీడియో)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఊహించినట్లుగానే అంతకుమించిన విజువల్స్‌తో దర్శకుడు శంకర్(Shankar) తన మార్క్ చూపించారు. యాక్టింగ్‌లో రామ్ చరణ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు. రామ్ నందన్ పాత్రతో పాటు, అప్పన్న పాత్రకు కూడా జీవం పోశారు. ముఖ్యంగా ‘రాకు రా.. సర్‌కు సర్’ అంటూ చెప్పిన డైలాగ్.. ‘మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్ పిచ్చెక్కించాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక కియారా(Kiara Advani), అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), ఎస్‌జే సూర్య(SJ Surya) పాత్రలను ఎప్పుడెప్పుడు బిగ్ స్ర్కీన్ మీద చూస్తామా? అనేలా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు






