Ram Charan: గేమ్ ఛేంజర్ హిట్.. హీరో రామ్ చరణ్ ఇంటి వద్ద అభిమానుల సందడి

by Ramesh Goud |

సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది.

Ram Charan: గేమ్ ఛేంజర్ హిట్.. హీరో రామ్ చరణ్ ఇంటి వద్ద అభిమానుల సందడి
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్(Director Shankar)దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా అభిమానుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 186 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలోనే రామ్ చరణ్ కు అభినందనలు తెలిపేందుకు హైదరాబాద్ లోని హీరో ఇంటి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులతో కోలాహాలం చేశారు. రాం చరణ్ ఫోటోతో ఉన్న జెండాలను పట్టుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను చూసి రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. బిల్డింగ్ పై నుంచే అభిమానులకు హీరో అభివాదం తెలిపారు. ఇక తనపై అభిమానానికి రామ్ చరణ్ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story