- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. ‘పెద్ది’ ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ఓపెన్
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఏపీ ప్రీమియర్ షోల బుకింగ్స్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓపెన్ అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) కథానాయకుడిగా, బుచ్చిబాబు సన డైరెక్షన్ తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు ఒకరోజు ముందే, అంటే జూన్ 3 రాత్రి నుంచే ఏపీలో ప్రత్యేక ప్రీమియర్ షోల ప్రదర్శనకు పర్మీషన్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ఓపెన్ అయ్యాయి. జూన్ 3న రాత్రి 8 గంటల నుంచే ఏపీలోని ప్రముఖ థియేటర్లలో ‘పెద్ది’ ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ ప్రత్యేక షోలకు సంబంధించిన టికెట్ ధరను జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ.600గా నిర్ణయించారు. జూన్ 4 నుంచి మొదటి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.100, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125 అదనంగా పెంచుకునేందుకు హోంశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక థియేటర్లలో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది






