- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లో ‘పెద్ది’ సందడి!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ దేశ రాజధాని ఢిల్లీలో కీలక షెడ్యూల్‌ను నిర్వహిస్తోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక, చారిత్రక ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రపతి భవన్, జామా మసీదు, ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతాల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలిసింది. భారీ పొగమంచు కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ, పటిష్ట భద్రత మధ్య షూటింగ్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ భవన్‌లలో జరిగిన చిత్రీకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఏపీ భవన్ క్యాంటీన్‌లో జరిగిన షూటింగ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి రామ్ చరణ్ అక్కడ సందడి చేయడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న ‘పెద్ది’ షూటింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో ఆసక్తి మరింత పెరుగుతోంది.






