- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవలపిల్లలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్-ఉపాసన దంపతులు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యాడు. తాజాగా ఉపసన, రామ్ చరణ్ దంపతులు కవలలకు జన్మనిచ్చినట్లు స్వయంగా చిరంజీవి పోస్ట్ పెట్టి శుభవార్త అందించారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చరణ్ - ఉపాసన రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ జంటకు ఒక బాబు, ఒక పాప ఇద్దరు జన్మించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
రామ్ చరణ్ దంపతులకు పాప, బాబు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యాడు. తాజాగా ఉపసన, రామ్ చరణ్ దంపతులు కవలలకు జన్మనిచ్చినట్లు స్వయంగా చిరంజీవి పోస్ట్ పెట్టి శుభవార్త అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ముగ్గురు ఆరోగ్యంగానే ఉన్నారని ఈ సందర్భంగా చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు. తమ కుటుంబంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు వచ్చారని.. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తోందని ఎమోషనల్ అయ్యారు. అలాగే, అభిమానులు తమ ఫ్యామిలీపై చూపించే ప్రేమ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు ఇప్పటికే క్లీం కారా జన్మించిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20వ తేదీన క్లీం కారా జన్మించారు.






