రాజీపడని ‘రామ్ భజరంగ్’

by Sujitha Rachapalli |

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాతలు స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్నారు.

రాజీపడని ‘రామ్ భజరంగ్’
X

దిశ, సినిమా : సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాతలు స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా.. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతుంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ క్రమంలోనే చిత్ర గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ... ‘‘రామ్ భజరంగ్’ సినిమా గ్లింప్స్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. డైరెక్టర్ సుధీర్ రాజు ఎక్కడా రాజీ పడకుండా పని చేశారు. నిర్మాత స్వాతి గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఇక ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలిపిన హీరో రాజ్ తరుణ్.. డైరెక్టర్ సుధీర్ రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుందని.. ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు.

Next Story