- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శుభవార్త చెప్పిన రకుల్..
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) పంజాగుట్టలో నూతనంగా "సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ" ప్రారంభించారు. గతంలో

దిశ, సినిమా : టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) పంజాగుట్టలో నూతనంగా "సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ" ప్రారంభించారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కత్తి శెట్టి వంటి ఎందరో స్టార్ హీరోయిన్లకు మేకప్ మాన్‌గా పనిచేసిన చక్రి తానే సొంతంగా ప్రారంభించిన ఈ నూతన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్ ...‘నాతో కొన్నేళ్లుగా ఉంటూ పనిచేసిన సోదర సమానులు చక్రి అన్న సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ పేరిట తన సొంత మేకప్ స్టూడియోను ప్రారంభించారు. నా తొలి చిత్రం నుండి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు మీరు చూసిన అన్ని సినిమాలకు నాకు మేకప్ చేసింది చక్రి అన్ననే. తను సొంతంగా ఒక మేకప్ అకాడమీ ప్రారంభించడం అనేది ఆయన కల. నేడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో కూడా ఆయన ఎటువంటి బ్రాంచీలు మరెన్నో ప్రారంభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం చక్రి అన్న. ఆయనకు మేకప్ పట్ల ఉన్న నాలెడ్జ్‌తో ఆయన మరింత ముందుకు వెళ్తారని అర్థమవుతుంది’ తెలిపింది రకుల్.






