Rakul Preet Singh: నాకు ఆ అవసరం రాలేదు.. అయినా అలా చేయడంలో తప్పు కూడా లేదు.. సర్జరీపై రకుల్ కామెంట్స్

by Chukka Sudharani |

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.

Rakul Preet Singh: నాకు ఆ అవసరం రాలేదు.. అయినా అలా చేయడంలో తప్పు కూడా లేదు.. సర్జరీపై రకుల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. రీసెంట్‌గా ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ‘ఇండియన్-3’ (Indian-3), ‘దేదే ప్యార్ దే 2’తో బిజీగా ఉంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social media)లోను యాక్టివ్‌గా ఉంటూ ట్రెండీ డెస్సుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ కాస్మెటిక్ సర్జరీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘అందం కోసం నేను ఎప్పుడు కాస్మెటిక్ సర్జరీ (cosmetic surgery)లు చేయించుకోవాలి అనుకోలేదు. ఎప్పుడు వాటి గురించి ఆలోచించలేదు కూడా. ఎందుకంటే ఆ దేవుడు నాకు అందమైన ముఖాన్ని ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చింది. అయితే.. పెదాలకు కాస్మెటిక్ సర్జరీ, పిల్లర్ చేయించుకున్నావు కదా అంటూ రకుల్‌పై ట్రోల్స్ రాగా.. తాజాగా వాటిపై స్పందించిన హీరోయిన్.. ‘పూర్వంలో చాలా వ్యాధులకు వైద్యం లేదు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ప్రతి దానికి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో అందంగా కనిపించాలని ఎవరైనా సర్జరీలు చేయించుకుంటే అందులో తప్పు ఏమి ఉంది.

Next Story