- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ హీరో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అల్లు అర్జున్(Allu Arjun), రామ్ పోతినేని(Ram potineni), కార్తి వంటి హీరోల సరసర నటించి.. స్టార్ గుర్తింపు దక్కించుకుంది. కానీ తర్వాత ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా రకుల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికన తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఆరోగ్యం గురించి అడగ్గా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపింది. కానీ హెల్త్ మనకు ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా.. కచ్చితంగా పట్టించుకుని వైద్యుల్ని సంప్రదించడం మేలని రకుల్ ప్రీత్ సింగ్ సలహా ఇచ్చింది.
అలాగే ఇటీవల ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదని అడగ్గా.. వచ్చే సంవత్సరంలో తను నటించిన మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపింది. అలాగే బరువు తగ్గడం గురించి మాట్లాడింది. బయట ఫుడ్ తినకూడదని.. హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలని పేర్కొంది. దీంతో వెయిట్ పెరగరని చెప్పుకొచ్చింది. కానీ పరిమితిని మించి పని చేయకూడదని.. శరీరం మాట వినడం ఆరోగ్యానికి మేలని వెల్లడించింది. తను చేసిన తప్పు ఇతరులు చేయొద్దని సూచించింది. వెన్ను గాయం అయినప్పుడు రెండు వారాల్లో తగ్గుద్ది అనుకున్నానని.. కానీ 8 వారాలు పట్టిందని తెలిపింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






