Happy International No diet Day: కొన్నిసార్లు దీన్ని అపరాధ భావన లేకుండా తినవచ్చు.. నెటిజన్లకు నటి సూచన

by Kodari Anjali |   (  Updated:2025-05-06 07:25:52  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది.

Happy International No diet Day: కొన్నిసార్లు దీన్ని అపరాధ భావన లేకుండా తినవచ్చు.. నెటిజన్లకు నటి సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఫ్యామిలీ అండ్ భర్తతో కలిసి గడిపిన క్షణాల్ని పంచుకుంటుంది. అలాగే ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఫిదా చేస్తుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. దీని గురించి మీకు తెలుసా అంటూ రాసుకొచ్చింది. కొన్నిసార్లు పిజ్జాను అపరాధ భావన లేకుండా తినవచ్చు అని నెటిజన్లకు నటి సూచించింది. రకుల్ పిజ్జా తింటోన్న క్యూట్ వీడియో కూడా అభిమానులతో పంచుకుంది.

ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు.. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో నా చీట్ డే ని అధికారికంగా మార్చింది అని, పిజ్జా బాగా తింటున్నాను కానీ చాలా కష్టపడుతున్నాను, రకుల్ కి ఇంటర్నేషనల్ నో డైట్ డే శుభాకాంక్షలు అంటూ పలువురు పలు రకాలుగా వరుస కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం అటు సినిమాల్లో ఇటు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పలు వేకషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు.

Next Story