నెట్టింట వైరలవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్.. రంగుల కథలో ఎరుపు నాటకమంటూ క్యాప్షన్ జోడించి?

by Kodari Anjali |   (  Updated:2025-05-02 15:09:40  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

నెట్టింట వైరలవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్.. రంగుల కథలో ఎరుపు నాటకమంటూ క్యాప్షన్ జోడించి?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ అండ్ హాట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే డైలాగ్ సాయి కుమార్ కుమారుడు సరసన రఫ్ చిత్రంలో కూడా నటించి.. తన సత్తా చాటింది. మొదట్లో చిన్న కథానాయకులతో నటించినా.. తర్వాత సీనియర్ హీరోల సరసన అవకాశం సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశం కొట్టేసి మరింత ఫేమ్ దక్కించుకుంది.

ఇకపోతే రకుల్ బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉండి.. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా టాక్. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. లేటెస్ట్ ఫొటో షూట్ చేసి.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెడ్ లెహంగాలోనున్న పిక్స్ పంచుకుని.. దీనికి ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘రంగుల కథలో, ఎరుపు నాటకాన్ని రాస్తుంది’’ అని రకుల్ ప్రీత్ సింగ్ రాసుకొచ్చింది.

Next Story